Wednesday, December 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

- Advertisement -

– తెలంగాణలో మూడో డిస్కం వెనక్కి తీసుకోండి : టీజీ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌
– సికింద్రాబాద్‌ సర్కిల్‌ వద్ద నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యుత్‌ సవరణ బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. నేషనల్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ అండ్‌ ఇంజినీర్స్‌ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌, ముషీరాబాద్‌ డీఈ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు, జెండాలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్‌ రంగంలో న్యూక్లియర్‌ ప్లాంట్ల ఏర్పాటును వెనక్కి తీసుకోవాలనీ, తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన మూడో డిస్కం ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న కుట్రలను ఆపాలని. ప్రభుత్వాలు దిగి రాకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ యునైటైడ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.గోవర్దన్‌, వై.విక్రంరెడ్డి, జె.ప్రసాద్‌రాజు, మురళీ, పద్మజ, సీఐటీయూ నాయకులు జె.కుమారస్వామి, ఎం.దశరథం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -