డీజీపీకి వినతిపత్రం అందజేసిన సీపీఐ నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇందిరాపార్కు వద్దనున్న ధర్నాచౌక్ ఎత్తివేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘ఆక్యుపై ధర్నాచౌక్’ కార్యక్రమం సందర్భంగా వామపక్ష, ఇతర పార్టీల నాయకులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యవర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర సమితి సభ్యులు ఎం.అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తాను చైర్మెన్‌గా, కో-చైర్మెన్లుగా పీఎల్ విశ్వేశ్వరరావు, తమ్మినేని వీరభద్రం, కోదండరామ్, తదితర రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి అనేక పోరాటాలు చేశామని డీజీపీకి చాడ వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం వేదికగా నెల పాటు ధర్నాచౌక్ పునరుద్ధరణ ధర్నాలు చేశామని గుర్తుచేశారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ హైకోర్టులో పిటిషన్ వేయగా… హైకోర్టు స్వీకరించి సానుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.
‘ధర్నాలు రిమోట్ ఏరియాలో ఎలా నిర్వహిస్తారు? ప్రజల గొంతును ప్రభుత్వానికి వినిపించొద్దా? ధర్నాచౌక్ నగరం మధ్యలోనే ఉండాలి..ఇందిరాపార్కులో ధర్నాలకు అనుమతిఇవ్వాలి’ అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. దీంతో ఇందిరాపార్కు అక్రమించడానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ”అక్యూపై ధర్నా చౌక్ కార్యక్రమం చేపట్టగా తనతో పాటు అనేక మంది నాయకులపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అనంతర కాలంలో ఇదే ఇందిరాపార్కు వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ధర్నాలు కూడా నిర్వహించడం ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ పునరుద్ధరణ ఉద్యమంలో తనతో పాటు వామపక్ష పార్టీల నేతలు, వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకు లపై బనాయించిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి ఆ కేసులను పరిశీలించి ఎత్తేస్తామని డీజీపీ హామీనిచ్చారని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.
వామపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులను ఎత్తేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



