Sunday, July 6, 2025
E-PAPER
Homeకరీంనగర్రైతు భరోసా జమచేయాలి ..

రైతు భరోసా జమచేయాలి ..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగర్
జిల్లా కేంద్రంలో ప్రారంభమైన సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు 
హాజరైన పలువురు సీపీఐ(ఎం) నాయకులు 
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్
: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసాను వెంటనే జమ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్ డిమాండ్ చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం ప్రారంభమయ్యాయి. మొదటగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతు భరోసాను ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.7500 వరకు పెంచుతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి రూ. 6 వేలు మాత్రమే ఇస్తుందన్నారు. ప్రస్తుత వానాకాలానికి 70 లక్షల మంది రైతులకు రూ.7,320 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాల్సి ఉందని, అప్పుడే రైతులు తమ పంటలకు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసేందుకు వీలుంటుందన్నారు. రైతు భీమాని 18-65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. అదేవిధంగా నాణ్యత లేని విత్తనాలను అమ్మడం వల్ల ప్రతి యేటా రూ 5 నుండి 6లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తింటున్నాయన్నారు.

నకిలీ విత్తనాల అమ్మే సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు పంట రుణాలు స్కేల్‌ ఆఫ్‌ పైనాన్స్‌ ప్రకారం వారికున్న భూమి మేరకు ఇవ్వాలి. రుణ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళికలో పొందుపరిచి జిల్లాల వారిగా కేటాయింపులను అమలు చేయాలని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు రుణాలతో సంబంధం లేకుండా రైతులందరికీ పంటల భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం సన్న దాన్యానికి క్వింటాల్ కు రూ.500ల బోనస్‌ మినహా మిగిలిన పంటలకు నిర్ణయించిన బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయోత్పత్తుల నిలవకు తగిన గోదాములను నిర్మించి మార్కెటింగ్‌ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో వ్యవసాయ రంగంతోపాటు రైతుల ఆదాయం పెరుగుతుందని, ప్రకటనలతో వ్యవసాయ రంగం అబివృద్ధి కాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మూశం రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, జవ్వాజి విమల, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, అన్నల్దాస్ గణేష్, మల్లార ప్రశాంత్, గురజాల శ్రీధర్, సూరం పద్మ, రమేష్ చంద్ర, సీపీఐ(ఎం) నాయకులు రామంచ అశోక్, గీస బిక్షపతి, నక్క దేవదాస్, మల్యాల నరసయ్య, సామలపల్లి రాములు, మనోజ్, సిరిమల సత్యం ఎలిగేటి శ్రీనివాస్, ఉడుత రవి, బెజిగం సురేష్, బండి శీను తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -