నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం తంగళ్ళపల్లి మండల వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జయంత్ కుమార్,పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఉపేంద్ర చారి జాతీయ జెండాను ఎగరవేశారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ ల కార్యాలయం ముందు కొన్నిచోట్ల నూతన సర్పంచులు,మరికొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగరవేశారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో నూతన సర్పంచ్ మోర లక్ష్మీరాజం, పద్మనగర్ నూతన సర్పంచ్ మోర నిర్మల,పద్మశాలి సంఘం ఆవరణలో అధ్యక్షులు రాపెల్లి ఆనందం, పద్మ నగర్ పద్మశాలి సేవా సంఘం లో అధ్యక్షులు మోర శ్రీకాంత్ జాతీయ జెండాను ఎగురవేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, యువజన సంఘాల్లో అధ్యక్షులు, కుల సంఘాల్లో అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగరవేశారు.



