Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో భవిష్యత్‌ ముఖ్యమంత్రి బీసీనే

కాంగ్రెస్‌లో భవిష్యత్‌ ముఖ్యమంత్రి బీసీనే

- Advertisement -

ఆ మాట చెప్పే దమ్ము బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఉన్నాయా? : మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భవిష్యత్తులో కాంగ్రెస్‌ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పే దమ్ము బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకుందా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఓబీసీ సెల్‌ చైర్మెన్‌గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్‌ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు బీసీ వ్యతిరేక పార్టీలని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసిందని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజరు కు బీసీలు గుర్తుకు రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సర్వే నిర్వహణ, అధికారిక డాటా విడుదల, బీసీలకు 42 శాతం డిక్లరేషన్‌ ప్రకటించి చట్టం చేశామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్‌ వద్ద ఎందుకు పెండింగ్‌లో ఉందో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ బలహీనవర్గాలకు న్యాయం చేయడానికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. 33 జిల్లాల్లోని బలహీన వర్గాలను సంఘటితం చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ రావత్‌, మంత్రులు వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -