– అంకితభావంతో విధులను నిర్వర్తించి ఉత్తమ పౌరులను తయారు చేయాలి
నవతెలంగాణ – కామారెడ్డి
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషన్ బిల్డర్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్య, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చేతుల్లోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని అంకితభావంతో విధులను నిర్వర్తించి ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు తమ పిల్లలను ఎన్నో ఆశలు, ఆశయాలతో పంపించడం జరుగుతుందని వారి ఆశయాలు ఆకాంక్షలు నెరవేరే విధంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేసి ఆదర్శంగా నిలిచి సమాజ అభివృద్ధికి బోధపడాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 16 మందికి నేషనల్ బిల్డర్స్ అవార్డును అందజేయడం జరిగింది. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు రోటరీ క్లబ్ కు అవార్డు గ్రహీతలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శంకర్, ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ హరి, కోశాధికారి పర్ష వెంకటరమణ, ప్రాజెక్టు చైర్మన్ శ్రీశైలం, రొటేరియన్స్ నాగభూషణం, డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి, సుధాకర్, సంతోష్, ధనుంజయ్, కాశీనాథం లు తదితరులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుని చేతుల్లోనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES