Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువతపైనే దేశ భవిష్యత్తు 

యువతపైనే దేశ భవిష్యత్తు 

- Advertisement -

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు వేడుక 
ప్రిన్సిపాల్ ఆరిగకూటి శ్రీనివాసరెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు
నేటి యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ప్రిన్సిపాల్ అరిగ కూటి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల  ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామంలో 20-09-2025 నుండి 26-09-2025 వరకు జరిగిన జాతీయ సేవా పథకం  7 రోజుల ప్రత్యేక శిబిరం శుక్రవారం నిర్వహించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ ప్రత్యేక శిబిరంలో వాలంటీర్లు సేవా భావంతో గ్రామంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచి సందేశాన్ని అందించారు అని తెలిపారు. ఎన్ ఎస్ స్ వాలంటీర్ల ను అభినందించారు. వాలంటీర్లు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

యువత సమాజ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తే దేశ భవిష్యత్తు బలపడుతుంది. ఈ ప్రత్యేక శిబిరం ద్వారా విద్యార్థులు సామాజిక బాధ్యతను నేర్చుకుంటారని పేర్కొన్నారు.  ఈ శిబిరంలో వాలంటీర్లు తమ కృషి ద్వారా గ్రామ ప్రజల్లో మార్పు తీసుకువచ్చారు అని అన్నారు. సమాజంలో చైతన్యం కలిగించడం వాలంటీర్ల ప్రధాన లక్ష్యంమని, ఇలాంటి శిబిరాలు మరిన్ని గ్రామాల్లో జరిగి, యువతలో సేవా భావం పెంపొందాలని  ఆకాంక్షించారు.  ఈ ఏడురోజుల పాటు వాలంటీర్లు గ్రామ శుభ్రత కార్యక్రమాలు, హరితహారం, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన, ఆరోగ్య శిబిరం, మొదటి సహాయ శిక్షణ, రక్తదాన కార్యక్రమం, నీటి సంరక్షణ,  స్వచ్ఛ భారత్ పై నినాదాలు, యువతలో నాయకత్వ లక్షణాల పెంపు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ శిబిరం ద్వారా విద్యార్థి వాలంటీర్లు సేవా స్పూర్తి, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లాడే మహేందర్, అధ్యాపకేత్ర బృందం లక్ష్మణ్,  ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు జేమ్స్ , శ్రీకాంత్ , కార్తీక్, సలీం, ఇమ్మానుయేల్, వీరన్న, ఉపేందర్, అనిల్, పవన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -