నవతెలంగాణ – వనపర్తి
బాలికలతోనే ప్రపంచ భవిష్యత్తు ముడివడి ఉందని ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ అన్నారు. శనివారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ( ఎన్ఎఫ్ఐ డబ్ల్యు) భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళా సమాఖ్య నేతలు బాలికలకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలను పుట్టనిద్దాం చదవనిద్ధం ఎదగనిద్దాం అంటూ నినాదాలు చేశారు. కళావతమ్మ మాట్లాడుతూ ఈనాటి బాలికే రేపటి మహిళా అన్నారు. ఆకాశం, భూమిలో సగభాగంగా మహిళలు ఉన్నారన్నారు. వారి అభివృద్ధి లేకుండా ప్రపంచానికి మనుగడ లేదన్నారు.
ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్నారని ఈ పరిస్థితి మారాలన్నారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలన్నారు. సమాజంలో చిన్న చూపు పోవాలన్నారు. మగ పిల్లలతో సమానంగా అంతకంటే ఎక్కువగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. కుటుంబాన్ని చక్కదిద్దటంలో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. బాలికలను ఆరోగ్యవంతులుగా ఆదర్శంగా పెంచాలన్నారు. బాలికలు లేకుంటే సృష్టి లేదని, మానవజాతి అంతరిస్తుందన్నారు. బాలికలను సంరక్షించి ప్రపంచ మనుగడను కాపాడాలి అన్నారు. పట్టణ కన్వీనర్ జయమ్మ, జ్యోతి సుప్రియ రూప సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, చైల్డ్ ప్రొటెక్షన్ లీగల్ ఆఫీసర్ శివ, రమణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.
బాలికలతోనే ప్రపంచానికి భవిష్యత్తు: కళావతమ్మ
- Advertisement -
- Advertisement -



