Saturday, July 26, 2025
E-PAPER
Homeకరీంనగర్27 న జరిగే మహాసభలను విజయవంతం చేయాలి

27 న జరిగే మహాసభలను విజయవంతం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి
సిరిసిల్లలో జూలై 27న (ఆదివారం) జరగనున్న CITU బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. వీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటియు జిల్లా మహా సభల కరపత్రాల శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు అరుణ్ కుమార్ ఆవిష్కరించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతు 

జిల్లాలోని బీడీ కార్మికులందరూ ఈ మహాసభలకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అరుణ్ కుమార్ కోరారు. ఈ సభలకు CITU బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. రమ, రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ మహాసభలో బీడీ కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. ఎన్నికల హామీ మేరకు రూ. 4000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి, బీడీ కార్మికులకు పనికి తగ్గ కనీస వేతనం నిర్ణయించాలి. 1000 బీడీలకు రూ. 600 చెల్లించాలి, పీఎఫ్ తో సంబంధం లేకుండా అందరు బీడీ కార్మికులకు రూ. 4000 పెన్షన్ అమలు చేయాలి. ప్రతి ఒక్క బీడీ కార్మికుడికి పీఎఫ్ అమలు చేయాలి, బీడీ కంపెనీ యజమానులు చేస్తున్న విపరీతమైన దోపిడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలి, 2000 బీడీల పని కోతను నిలిపివేయాలి. నెలకు కనీసం 26 రోజుల పాటు పని కల్పించాలి. బీడీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. బీడీ తయారీకి నాణ్యమైన ఆకు, తంబాకు అందించాలనీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -