Thursday, December 25, 2025
E-PAPER
Homeక్రైమ్కుక్కకాటుకు బాలిక మృతి

కుక్కకాటుకు బాలిక మృతి

- Advertisement -

తర్నికల్‌ గ్రామంలో విషాదం
నవతెలంగాణ-కల్వకుర్తి

పిచ్చికుక్క కాటు వేయడంతో తొమ్మి దేండ్ల బాలిక మృతి చెందింది. ఈ విషా దకర ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వ కుర్తి మండలంలోని తర్నికల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బచ్చలకూర రమేశ్‌ కూతురు అవంతిక(9)ను నెల రోజుల కిందట పిచ్చికుక్క కాటు వేసింది. దీంతో బాలికను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలిక పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -