నవతెలంగాణ – మద్నూర్
నా సంకల్పం ఒక్కటే.. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో కళ్యాణ లక్ష్మి, చెక్కులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వ కాలంలో జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు, ఇవ్వలేదని డబ్బులు బెడ్ రూమ్ లు ఇవ్వలేదని అన్నారు.
అనంతరం బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. మద్నూర్ మండలంలో 795 కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా 2,612 మంది పేర్లను కుటుంబ రేషన్ కార్డుల్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు గొప్ప పథకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిఎస్ఓ అధికారి, మద్నూర్ మండల తాహశీల్దార్ ఎండి.ముజీబ్, ఆర్ఐ శంకర్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు, సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, సంతోష్ మేస్త్రి, చిన్న షాక్కర్గా దిగంబర్ ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపిటిసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు, రెవిన్ శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES