ఎర్రబెల్లి గూడెం గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్
నవతెలంగాణ – నెల్లికుదురు
గత వారం రోజుల నుండి నీరు కోసం ఇబ్బంది పడుతున్న ఎర్రబెల్లి గూడెం గ్రామ ప్రజల దహర్తి తీర్చడమే లక్ష్యంగా ముందుకు సాగామని ఆ గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆ గ్రామ ఉపసర్పంచ్ జిలకర సాంబమూర్తి తో కలిసి నూతన పైపులైను బావి నుండి ట్యాంక్ వరకు వేసి నీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ నీరు గత వారం రోజుల నుండి రాకపోవడంతో గ్రామంలోని ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ప్రజలు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో బావి నుండి నూతన పైపులైను ట్యాంక్ వరకు వేసి ట్యాంకు నీరు ఎక్కించి ర్యాంక్ నుండి గ్రామంలోని అన్ని వీధిలోకుండా ప్రతి ఇంటికి నీటిని అందిస్తున్నామని అన్నారు. గ్రామంలోని ప్రజలు నీటి కోసం కొన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారని కనీసం బట్టలు పిండుకోవడానికి ఇండ్లలోని పాత్రలు కూడా కడుక్కోవడానికి మరియు పశువులకు త్రాగడానికి నీటి వసతి లేక అనేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది మరియు అదనపు వ్యక్తులను తీసుకొని జెసిబి సహాయంతో కాలువ తీసి అందులో పైపులు వేసి నీటిని అందించే దిశగా ప్రయాణిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి కరోబార్ బండారి రాములు రఫీ శ్రీశైలం సిబ్బంది పాల్గొన్నారు.



