Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం

ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యం

- Advertisement -

– ఆర్బిఐ ఎల్డిఓ గోమతి..
నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రజలను చైతన్యం చేయడమే ఆర్థిక అక్షరాస్యత లక్ష్యమని ఆర్బిఐ ఎల్డిఓ గోమతి,జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.వి.నాగప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని అన్ని బ్యాంకుల అధికారులు సిబ్బంది కలిసి ర్యాలీ నిర్వహించి,ఖాతాదారులకు, ప్రజలకు సురక్షితమైన బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కేవైసీ యొక్క ప్రాథమిక అంశాలైన మనీలాండరింగ్,ఫైనాన్సింగ్,మోసం వంటి ఆర్థిక నేరాలు నిరోధించడానికి,కస్టమర్ గుర్తింపులను దృవీకరించడం, వాటిని ఎలా నియంత్రించాలనే అంశాలపై కాకుండా ఖాతాదారులకు,ప్ రజలకు కేవైసీ పైన ఒక నమ్మకాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

తద్వారా ఆర్థిక సంస్థలు,నిజాయితీ గల కస్టమర్లను అక్రమ కార్యకలాపాల నుండి రక్షించడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేవైసీకి సంబంధించిన అవసరమైన పత్రాలను ఎలా సమర్పించాలి,కాలానుగుణంగా అనుసరించాల్సిన మార్గాలు,కేవైసీ అభ్యర్థన కోసం అందుబాటులో ఉన్న మోడ్లు ఏమిటి? ఈకేవైసీ రిజిస్ట్రీ అంటే ఏమిటి? కేవైసీ ప్రక్రియను సులభతరం చేయడంలో కస్టమర్ల పాత్ర ఏమిటి? కేవైసీ స్థితి,సంఖ్యను ఎలా తనిఖీ చేయాలి అనే అంశాలపై వివరించారు.

అంతేకాకుండా కేవైసీ సంబంధిత మోసాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? సైబర్ మోసాలకు బాధితులైతే వారు ఏం చేయాలి? మనీ సంబంధిత మోసాల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం పౌర సమాజంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ వెంగళ్ రావు,ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ సృజన,ఎస్బిఐ రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ వివిధ బ్యాంకుల ఉద్యోగులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -