Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంది

ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుంది

- Advertisement -

– మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య 
ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాలకు పెద్ద పీట వేస్తుందని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్త చెరువు తాండా, కోన సమందర్, ఇనాయత్ నగర్, బషీరాబాద్ గ్రామాల్లో ఐకేపీ డిఆర్డిఏ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, తహసీల్దార్ గుడిమేల ప్రసాద్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ పెద్ద పీట వేస్తుందన్నారు.మహిళా సంఘాలకు అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2369 ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగిందని, రైతులు దళారులకు అమ్మవద్దని సూచించారు. తహసీల్దార్ గుడిమేల ప్రసాద్ మాట్లాడుతూ తేమ 17శాతంకు మించకుండా మైచ్చర్ వచ్చిన వడ్లలను మాత్రమే తూకం చేయాలన్నారు. తాలు, తప్ప లేకుండ చూడాలని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, ఐకేపీ ఏపియం కిరణ్ కుమార్, మండల రెవెన్యూ అధికారి శరత్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి స్వామి, సిసిలు ఏడేల్లి రవి, పీర్య నాయక్, భాగ్య వతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిన్నోల్లా రేడ్డి, గుడిసె అంజమ్మ, సంతోష్, అనిల్, భూమేష్, గ్రామ సంఘాల అధ్యక్షురాల్లు, కమిటీ సభ్యులు, ఐకేపీ విఓఏలు  గంగాధర్, గణేష్, నయన, లత, బాలమణి, రుచిత, భాగ్య, రేవతి, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -