మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
మల్లాల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలన
నవతెలంగాణ-చిన్నకోడూరు
కాంగ్రెస్ పాలనలో రైతులను నట్టేట ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు కేవలం ఐదు, ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు.
కొన్న వాటికి కూడా బిల్లులు సరిగా రావడం లేదన్నారు. వెంటనే కొనుగోలును వేగవంతం చేయాలని, బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మక్క, పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులతో మాట్లాడి.. త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు కాముని ఉమేష్, పాపయ్య, కనకరాజు, సదానందం, ఆంజనేయులు, రైతులు తదితరులు ఉన్నారు.
రైతులను ముంచుతున్న సర్కార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



