ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రైతులు వేసిన వరి, ఇతర పంటలకు వరద నీరు చేరి వరి పంట, మొక్కజొన్న, సొయా, పత్తి ఉద్యానవన తదితర పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. జిల్లాలో 21 మండలాలలో 42,098 ఎకరాలు పంట నష్టం జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని అన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే ప్రకటించి అందజేసే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వాస్తవానికి అధికారులు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు.
గ్రామాల్లో అందరి నోట నష్టం మాటనే ఉందని, రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమగ్ర సర్వే నిర్వహించి పంట నష్టాలను అంచనా వేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం అందించి, ఈ ఖరీఫ్ పంటకు తీసుకున్న అప్పులను మాఫీ చేయాలని వివరించారు. వర్షానికి తెగిన రోడ్డును రోడ్డు భవనాల శాఖ అధికారులు వెంటనే మరమ్మత్తులు చేయాలని, కొట్టుకుపోయిన వంతెనలు, బుంగలు పడి తెగిన చెరువులను పునరుద్దించాలని భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జె పి గంగాధర్,పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, నాయకులు గంగదాస్, జె గంగారం తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి …
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES