బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ భువనగిరి బిజెపి మండల శాఖ అధ్యక్షులు చీర్కా సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో గల తుక్కాపురం గ్రామంలో ఐకెపి సెంటర్ ను బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం నరసయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని దీనిని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని రైతులకు బోనస్ గా ఇస్తానన్న 500 రూపాయలు వెంటనే చెల్లించాలని కోరారు.
రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ , మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ , పడమటి జగన్మోహన్ రెడ్డి , చంద మహేందర్ , మండల ఇంచార్జ్ జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, ఫకీర్ రాజేందర్ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శులు నాగు వినోద్ కుమార్, మాటూరి అనిల్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బబ్బూరి సురేష్ గౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పడమటి మాణిక్యం రెడ్డి, మట్ట ఆంజనేయులు గౌడ్, కొత్తపెళ్లి చంద్రశేఖర్, భువనగిరి సిద్దు గౌడ్, బబ్బూరి శంకర్ గౌడ్,బూత్ అధ్యక్షులు ఎలకొండ రాజశేఖర్ రెడ్డి, రత్నపురం శ్రీకాంత్, సీనియర్ మండల నాయకులు, వల్లపు సతీష్, ఎలకొండ సుధాకర్ రెడ్డి,వల్లపు సురేష్, రసాల పుల్లయ్య, కంటం రాజమోహన్, కంటం నరేష్, కోలా శివ, దుర్గ, పిట్టల కిరణ్, రసాల సత్యనారాయణ, పొట్ట రాజశేఖర్ లు పాల్గొన్నారు.



