- Advertisement -
సంక్షేమ సంఘం నాయకులు చెలిమేటి గంగాధర్
నవతెలంగాణ – రామారెడ్డి
గొర్రెలు, మేకలు విద రోగాలతో రోడ్డు ప్రమాదంలో ఒక అనేక జీవాలు చనిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి గొర్రెలకు, మేకలకు బీమా కల్పించాలని మేకల గొర్రెల పెంపకదారుల సంఘం కామారెడ్డి నాయకులు చెలిమేటి గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది కాపరులు , దాదాపు రెండు కోట్ల 39 లక్షల 973 గొర్రెలు , మేకలపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. 50 సంవత్సరాలు దాటిన పెంపదారులకు పింఛను అందించాలని డిమాండ్ చేశారు. గొర్రెలకు మేకలకు మేత కోసం భూమి కేటాయించి , వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



