Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

గొర్రెల కాపర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

- Advertisement -

యాదవ సంఘం నాయకులు
నవతెలంగాణ – మల్హర్ రావు

పిడుగుపాటుతో సుమారుగా వంద గొర్రెలు మృత్యువాత పడ్డ బాధిత కాపర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత యాదవ్ మహాసభ సంఘం మండల నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామంలో  పిడుగు పాటుకు గొర్రెలు చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం డివిజన్ అధ్యక్షులు ఆత్మకూరి స్వామి యాదవ్,మండల మాజీ అధ్యక్షులు  యాదండ్ల రామన్న యాదవ్,కాటారం మాజీ అధ్యక్షులు గడ్డం చంద్రయ్య  యాదవ్,డివిజన్ ఉపాధ్యక్షులు కొడారి చిన్నమల్లయ్య యాదవ్,అప్పల పోచన్న యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -