Friday, May 16, 2025
Homeకరీంనగర్రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

- Advertisement -

గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్
కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
: రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసమేనని గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప హాజరై మాట్లాడుతూ… గత ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఆడబిడ్డల పెళ్లి కోసం ప్రభుత్వం  అండగా నిలిచి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ను అందజేస్తుందన్నారు. ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావద్దని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మండల వ్యాప్తంగా 96 మంది లబ్ధిదారులకు గాను 96లక్షల 11వేల 136 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ జయంత్ కుమార్, మహిళా అధ్యక్షురాలు హారిక రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బాలు, పరుశురాములు, శైలజ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క శేఖర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సత్తి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -