- Advertisement -
నవతెలంగాణ – పెద్దవంగర
మండల వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయాన్నే తలంటు స్నానాలు ఆచరించి పూలను సేకరించిన మహిళలు.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం సంప్రదాయ దుస్తుల్లో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, చెరువుల ప్రాంతాలు, ఆట స్థలాలకు బతుకమ్మలతో ర్యాలీగా చేరుకున్న ఆడబిడ్డలు.. ఒకచోట చేరి కోలాటాలు, బతుకమ్మ పాటలతో అలరించారు. రాత్రి వరకు ఆటలు ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వర్షం రావడంతో మహిళలు తడుస్తూనే తిరిగి ఇండ్లకు చేరుకున్నారు. బతుకమ్మ వేడుకలకు సుదూర ప్రాంతాల నుండి మహిళలంతా స్వగ్రామాలకు తరలిరావడంతో గ్రామాలన్నీ సందడి వాతావరణం నెలకొంది. 
- Advertisement -

                                    

