- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గల మన గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల, దుకాణం ను ముధోల్ ఎస్ఐ బిట్ల పెర్సిస్, వ్వవసాయ అధికారి రచన సోమవారం తనీఖీ చేశారు. పురుగుమందులు, ఎరువులను పరిశీలించారు. పలు వివరాలను మన గ్రోమోర్ మేనేజర్ యోగేష్ ని అడిగి తెలుసుకున్నారు. ఎరువులు, మందులు కొనుగోలు చేసిన రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మన గ్రోమోర్ ఏరియా మేనేజర్ నారాయణ స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ బూషీ రాకేష్ పాల్గొన్నారు.
- Advertisement -