కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి
రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ – కంఠేశ్వర్
హై కోర్టు కోర్టు తీర్పు ను వెంటనే అమలు చేయాలి అని, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి అని రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేర్ డిగ్రీ కళాశాలలో డీఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిపిఎస్ అమలు తేదీ 01.09.2004 కు ముందు నియామక నోటిఫికేషన్ లు, వ్రాత పరీక్ష, ఫలితాలు విడుదలై సిపిఎస్ అమలు తేదీ 01.09.2004 తరువాత ప్రభుత్వ ఆలస్యం కారణంగా నియామకం జరిగి, సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు, పాత పెన్షన్ వర్తింపజేయాలి అని కేంద్ర ప్రభుత్వం మెమో 57 ఇవ్వడం జరిగింది.
ఈ మెమో ఆధారంగా దేశం లోని దాదాప సగం రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశాయి. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా 3 నెలలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. కావున 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో 70 మంది డిఎస్సీ 2003 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ 2003 పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు యు. విజయ్ కుమార్, వెంకట్ రాజ్ రెడ్డి, సురేందర్, రామకృష్ణ,మురళి,మాణిక్యం, పరమేశ్వర్, స్వప్న, మాధవి, రాగసుధ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES