- Advertisement -
– హౌసింగ్ ఏఈ హనుమంత్
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ను సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, హౌసింగ్ ఏఇ హనుమంత్ సెక్రటరీ సంజయ్ కుమార్ పరిశీలించారు. హౌసింగ్ ఏఇ హనుమంత్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన సరైన పద్ధతిలో ఇల్లు నిర్మించుకోవాలని ఇల్లు మొదలుపెట్టినవారు తొందరగా పూర్తి చేయాలని తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన సరైన పద్ధతిలో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు వెంట వెంటనే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు లబ్ధి పొందాలంటే హౌసింగ్ ఏఈ సూచనలు పాటించాలని ఆయన కోరారు ఈ పరిశీలన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.
- Advertisement -



