Monday, April 13, 2026
E-PAPER
Homeఆటలుపతిరణ రైట్‌రైట్‌

పతిరణ రైట్‌రైట్‌

- Advertisement -

యువ పేసర్‌కు శ్రీలంక ఎన్వోసీ

కొలంబో : ఐపీఎల్‌ 19లో వరుస ఓటములతో నైరాశ్యంలో కూరుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓ శుభవార్త. యువ పేసర్‌, శ్రీలంక ఆటగాడు మతీశ పతిరణ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో గాయపడిన మతిశ పతిరణ కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరైన పతిరణ.. టెస్టులో పాసై నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) పొందాడు. ఈ నెల 17న కొలంబో నుంచి బయల్దేరనున్న పతిరణ.. ఆ రోజే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ శిబిరంలో చేరనున్నాడు. 16న టైటాన్స్‌తో నైట్‌రైడర్స్‌ తలపడనుంది. 19న ఈడెన్‌గార్డెన్స్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు పతిరణ అందుబాటులో ఉండనున్నాడు. అయితే, పతిరణకు నైట్‌రైడర్స్‌ వైద్య బృందం సైతం గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ముస్తాఫిజుర్‌ను సీజన్‌కు ముందే విడుదల చేయగా.. హర్షిత్‌ రానా, ఆకాశ్‌ దీప్‌ గాయాల బారిన పడటంతో నైట్‌రైడర్స్‌ పేస్‌ విభాగం బలహీనపడింది. మతీశ పతిరణ రాకతో ఆ జట్టు బౌలింగ్‌ దళానికి ఉత్సాహం రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -