- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక పట్టణ కేంద్రంలో బొడ్రాయి (నాభిశిల, భూ లక్ష్మిదేవి) ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలు బుధవారం మొదలైనాయి. అందులో భాగంగా గురువారం గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, యాగశాల ప్రవేశం, అఖండ దీప స్థాపన, మంటప ఆరాధనలు, ప్రధాన కలశ స్థాపన, ఉపచార పూజలు వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పాల్గొని రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -