బరిలో 24 దేశాల నుంచి 200 మంది క్రీడాకారులు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ (టీఎస్‌టీఏ), జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేహెచ్‌ఐసీ) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఐటీఎఫ్ మెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్ ఎమ్15 హైదరాబాద్’ టోర్నమెంట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 13.5 లక్షల ప్రైజ్ మనీ కలిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీని జేహెచ్‌ఐసీ ప్రాంగణంలో ఆ సంస్థ కార్యదర్శి సి.హెచ్. జగ్గారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కన్వీనర్ ఏ. సురేష్ రెడ్డి, టీఎస్‌టీఏ అధ్యక్షుడు కె.ఆర్. రమణ్, టోర్నమెంట్ కో ఆర్డినేటర్లు రామకష్ణ బాబు. పి, పి.వి.ఆర్.ఎల్.ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో భారత్‌కు చెందిన మనీష్ సురేష్ కుమార్ సంచలన విజయం నమోదు చేశాడు. తొలి రౌండ్‌లో మనీష్ 6-2, 6-1 తేడాతో .. టోర్నీ టాప్ సీడ్, ఉక్రెయిన్ క్రీడాకారుడు ఎరిక్ వాన్షెల్‌బోయిమ్‌ను ఓడించాడు. మరో కీలక మ్యాచ్‌లో భారత వెటరన్ ఆటగాడు విష్ణు వర్ధన్ తన అనుభవాన్ని చాటుకున్నాడే. థాయిలాండ్‌కు చెందిన 6వ సీడ్ ఆటగాడు తానాపేట్ చంటాను 6-3, 6-4తో ఓడించి శుభారంభం చేశాడు ఇతర మ్యాచ్‌లలో ఇజ్రాయెల్ ఆటగాడు అమిత్ వేల్స్, అమెరికాకు చెందిన కేశవ్ చోప్రా, ఇండోనేషియాకు చెందిన ముహమ్మద్ రిఫిక్ ఫిట్రియాడి తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. డబుల్స్ విభాగంలోనూ భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. అర్జున్ రాఠీ – కహీర్ వారిక్ జంట 7-6, 6-4తో పార్థ్ అగర్వాల్ – ఉదిత్ కాంబోజ్ జంటపై విజయం సాధించింది. నికితా యాని – రాఘవ్ జైసింఘాని జంట 2-6, 6-3,10-4 తో రష్యా ప్రత్యర్థులపై విజయం సాధించగా, ఆదిత్య బల్సేకర్ – అథర్వ శర్మ జోడీ హోరాహోరీ పోరులో 2-6, 6-3,10-8 తో లోహితాక్ష – అభినవ్ సంజీవ్ జంటను ఓడించింది. ఇషాకీ ఇక్బాల్ – దేవ్ జావియా ద్వయం 6-4, 6-4తో యశ్వంత్ – ధీరజ్ రెడ్డి జంటపై గెలుపొందింది.
ఐటీఎఫ్ మెన్స్ టెన్నిస్ టోర్నీ షురూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



