నవతెలంగాణ – మల్హర్ రావు
రేపటి నాయకులే నేటి యూత్ కాంగ్రెస్ అని, సేవ, త్యాగం, సమానత్వం, యూత్ కాంగ్రెస్ మార్గదర్శక సూత్రాలన్నారు. శనివారం యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహా ముత్తారం, మల్హర్ మండలాల్లో యూత్ కాంగ్రెస్ జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి యూత్ కాంగ్రెస్ అభిర్భవ వేడుకలు ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశానికి సేవ చేయాలనే సంకల్పం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ.. దేశ సమగ్రతకు అభివృద్ధికి కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబుల మార్గదర్శకత్వంలో యూత్ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని, సమాజానికి దేశానికి సేవ చేస్తూ యూత్ కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపటి నాయకులే నేటి యూత్ కాంగ్రెస్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES