ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంజుల
నవతెలంగాణ – పాలకుర్తి
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో పాలకుర్తి మార్కెట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల ఐలమ్మ మార్కెట్ లోగల చైర్మన్ మార్కెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఎమ్మెల్యే సహకారంతో మార్కెట్ కు వచ్చే రైతులకు స్వాగతం పలికేందుకు రైతు ఎడ్ల బండి, నూతన కవర్ షెడ్, సిసి లను ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానం చేసిందన తెలిపారు.
మార్కెట్లో క్రయవిక్రయాలను ప్రారంభించి సరుకులను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, మార్కెట్ కార్యదర్శి భాస్కర్, డైరెక్టర్లు గొనె అశోక్ రెడ్డి, ఎండీ నజీర్, బానోత్ రమేష్ నాయక్,ఘనపురం నర్సయ్య ,పసులాది చిన్న యాకయ్య, ఇలబెల్లి విజయ్ కుమార్,దుబ్బ యాకయ్య, దేవరాయ వెంకన్న, వంగల అశోక్,గంగపురం స్వామి, మెతుకు రాజు , నంగునూరి సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో మార్కెట్ ను అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES