Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంరిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలి

రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలి

- Advertisement -

సుప్రీం తీర్పుపై సీపీఐ(ఎం) డిమాండ్‌
న్యూఢిల్లీ : ఒక వ్యక్తి క్రైస్తవంలోకి మారి, చురుకుగా ఆ మతాన్ని, దాని ఆచార, సంప్రదాయాలను పాటిస్తున్నట్లైతే ఇక ఆ వ్యక్తిని ఎస్సీ సభ్యుడిగా పరిగణించలేమంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడంతో సీపీఐ(ఎం) తీవ్రంగా విభేదించింది. ఈమేరకు పొలిట్‌బ్యూరో బుదవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎస్‌సి కమ్యూనిటీకి కల్పించిన రిజర్వేషన్లు, ఇతర రక్షణలు ఆయా కమ్యూనిటీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి వున్నాయని సీపీఐ(ఎం) ధృఢంగా విశ్వసిస్తోందని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది.

అయితే, ప్రస్తుత తీర్పు మాత్రం సంబంధిత గ్రూపు సామాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకునే కన్నా మతపరమైన గుర్తింపునకే స్పష్టంగా ప్రాధాన్యతనిచ్చింది. అందువల్ల, ప్రస్తుత ఉత్తర్వులు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్‌, ఇతర రక్షణలు కల్పించాలనే మూల లక్ష్యాన్నే దెబ్బతీస్తున్నాయి. అందువల్ల ఈ ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని, వారు పరిశీలించి, ప్రస్తుత ఉత్తర్వులను సవరించాలని పోలిట్‌బ్యూరో అభిప్రాయపడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -