కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న 2 వేల మందిని అన్ ఫిట్ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఈ అంశానికి సంబంధించి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్థన్ తో కలిసి బుధవారం వీడియో మెసేజ్ విడుదల చేశారు. మెడికల్ బోర్డు పెట్టాలని తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ చేసిన హెచ్చరికలకు గత నెలలో ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. కానీ ఒక్క నెల మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి మళ్లీ ఈ నెల మెడికల్ బోర్డు పెట్టటం లేదని విమర్శించారు. ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతి నెల బోర్డు పెట్టాలని డిమాండ్ చేశారు. ట అలియాస్ పేర్ల అంశాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్మిక యూనియన్లు హక్కులు కోల్పోయేందుకు కారణమైన వ్యక్తి కూనంనేని సాంబశివరావు అని ఆమె విమర్శించారు. అలియాస్ పేర్లతో ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న వారు నిరాహార దీక్ష చేస్తే వారి దీక్షను ఆయనే విరమింపజేశారని తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆయన అలియాస్ పేర్ల విషయంలో నిరాహార దీక్ష చేపట్టిన వారికి ఏం హామీ ఇచ్చారు? వారి హక్కులను, వారికి రావాల్సిన ఉద్యోగాలను ఇప్పిస్తారా? లేదా చెప్పాలి? అని ప్రశ్నించారు. అలియాస్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో అన్ని యూనియన్ల నుంచి అఫిడవిట్లు ఇస్తే కూనంనేని యూనియన్ మాత్రం ఎగ్గొట్టిందని చెప్పారు. ఇప్పుడేమో దీక్షను విరమిం పజేశారని తెలిపారు. ఈ ద్వంద్వ వైఖరి సరి కాదని పేర్కొన్నారు. హామీల అమలు కోసం ఆందోళన బాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్దరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



