మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
సీఐటీయూ మండల కన్వీనర్ అంబటి లక్ష్మణ్
నవతెలంగాణ – జన్నారం
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయూ జన్నారం మండల అధ్యక్షుడు అంబటి లక్ష్మణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పొన్నకాల్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణ ముందు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) రాష్ట్ర ఐదవ మహాసభల వాల్ పోస్టర్స్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2025 అక్టోబర్ 24, 25 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు )5 వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలలో కార్మికుల సమస్యలన్నీ చర్చించి భవిష్యత్తు కార్యచరణ రూపొందించుటకు కార్మికులందరూ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్( సీఐటీయూ ) కార్మిక నాయకులు ధూమాల రవి మండల కార్యదర్శి, డి సుధాకర్ మండల అధ్యక్షులు, డి. కాంతయ్య సలహాదారులు, జె.పోసిలింగు, కే సురేష్,బి రత్నయ్య, ఓ శ్రీనివాస్, డి దాస్, కే లచ్చన్న, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.