Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగాంధీని మరోసారి హత్య చేసిన మోడీ ప్రభుత్వం

గాంధీని మరోసారి హత్య చేసిన మోడీ ప్రభుత్వం

- Advertisement -

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జీ చిన్నారెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం అన్యాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ డాక్టర్‌ జీ. చిన్నారెడ్డి అన్నారు. 1948లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాథురామ్‌ గాడ్సే మహాత్మాగాంధీని భౌతికంగా హత్య చేశాడనీ, గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం ద్వారా బీజేపీ 2025లో మరోసారి ఆయన్ని హత్య చేసిందని విమర్శించారు. సోమవారం యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఆడిటోరియంలో ఎన్‌ఎస్‌యుఐ, రాష్ట్ర ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ సంయుక్తంగా ”వీబీజీ రాంజీ” అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నరేగా ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఉపాధి పొందుతున్నారనీ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చేలా సవరణలు చేసిందని వివరించారు. దీనివల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరిగి, పథకం లక్ష్యం నీరుగారుతుందని చెప్పారు. ఈ జాతీయ సెమినార్లో అమెరికా బ్రౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ యామిని అయ్యర్‌, తమిళనాడు రాష్ట్ర మాజీ ఐఏఎస్‌ కన్నన్‌ గోపీనాథన్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్లు నవిక హర్ష, విజయ్, ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జి ఆదిత్య రెడ్డి, నిర్వాహకులు రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -