- Advertisement -
ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగలవీడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం జరిగిందని నెల్లికుదురు ఆ సెక్టార్ సూపర్వైజర్ నాగమణి తెలిపారు. గురువారం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో లభ్యమయ్యే పౌష్టికాహారాన్ని ప్రతి గర్భిణీ స్త్రీ బాలింతలు కిశోర బాలికలు ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎత్తుకు తగ్గ బరువు ఉండేందుకు ఈ కేంద్రాల్లో పౌష్టికాహారం లభ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య అంగన్వాడి టీచర్లు వీరలక్ష్మి వెంకటమ్మ జమ్మిలాంబి మహతి సరోజన ఆయాలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
- Advertisement -