- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూరు
అరెస్టులతో మధ్యాహన్న భోజన కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని సీఐటీయూ జిల్లా నాయకులు పెంజర్ల సైదులు అన్నారు. బుధవారం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన చలో హైదరాబాద్ కమీషనరేట్ ముట్టడి సందర్భంగా కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అరెస్ట్ అయిన వారిలో మధ్యాహ్న భోజన కార్మికులు మాచర్ల యాదమ్మ, కంకణాల శోభరాణి, కొప్పు మంగమ్మ ఉన్నారు.
- Advertisement -