– మంత్రి వాకిటి శ్రీహరికి తప్పిన ప్రమాదం
– మక్తల్ తహసీల్దార్ ఆఫీస్‌లో ఘటన
నవతెలంగాణ -మక్తల్
భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పశుసంవర్థక, క్రీడల శాఖల మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జాతీయ పతాకావిష్కరణ చేసే సమయంలో జెండా కట్టె విరిగిపడింది. తృటితో ఆయనకు ప్రమాదం తప్పినా పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు కున్సి నాగేందర్ కాలి బొటనవేలుపై కర్ర పడటంతో నరం చిట్లిపోయింది. ఆయనకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం పాలమూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంత్రి వెంటనే విరిగిపడిన జెండా కట్టెను అలాగే పైకి అందించగా.. కార్యాలయ సిబ్బంది జెండా ఉన్న మిగతా కట్టెను తాడుతో కట్టి వదిలేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఆ దిమ్మె ఎండకు వానకు నానుతూ ఉండటంతో కర్ర లోపల పుచ్చుపట్టి విరిగినట్టు తెలుస్తోంది.
విరిగిపడిన జాతీయ జెండా కర్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



