Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..

20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు: బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజ స్వామ్యమును విస్మరించి  అన్ని రంగాలను ఖూనీ చేసే విధంగా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు మే 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం కోరారు. శనివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటుచేసిన రైతు సంఘం మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా బీజేపీ ప్రభుత్వం కొట్లాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను తేవడానికి తీవ్రంగా ఖండించారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దేవుడి పేరిట రాజకీయం చేయడం దారుణమని మండిపడ్డారు. రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 16 నెలలు గడుస్తున్న రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ , రైతు భరోసా అర్హులైన ప్రతి రైతుకు అందించాల్సిన పథకాలను అందించకుండా కాలయాపన చేయడంతో రైతులు ఎప్పుడొస్తాయి అని ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపరించదని ఆరోపణ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ రైతు భరోసా వెంటనే ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ ప్రకటించిన గిట్టుబాటు ధరకు అందుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తే లారీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. లారీలలో ఉన్న ధాన్యమును మిల్లర్స్ దిగుమతి వెంటనే చేసుకోకపోవడంతో లారీ ఓనర్స్ వెయిటింగ్ చార్జీ రూ.2000 ముందే చెల్లిస్తేనే లోడు ఎగుమతి చేసుకునేందుకు వస్తుండడంతో  లారీ ఓనర్స్ కు కి ఇచ్చే రూ.2000 లను రైతుల నుండి వసూలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో రైతులపై బారాలు మోపకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సూచించారు. లేనిపక్షంలో రైతులతోని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్ , డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మిర్యాల భరత్ , డోలు దెబ్బ వ్యవస్థాపకులు ఎం యాదయ్య , సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు , రైతు సంఘం మండల నాయకులు వేముల లింగస్వామి , యాట యాదయ్య , కొంక రాజయ్య , ఎట్టయ్య ,పగిళ్ల మధు , యాదయ్య లింగస్వామి , ఎర్ర లింగయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -