– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్‌ఫ్లాప్ టీవీ సీరియల్‌ను తలపిస్తోందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసలు బాధ్యులైన అధికారులను వదిలేసి కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా నోటీసులిచ్చి పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని విమర్శిం చారు. మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టిమరల్చడం కోసమే ఈ కేసు విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. సంతోష్‌కుమార్‌కు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని తెలిపారు.
రాజకీయ డ్రామా : హరీశ్‌రావు
మాజీఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులివ్వడం రాజకీయ డ్రామా అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బొగ్గుకుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాతే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తనకు నోటీసుల పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని చూసిందని విమర్శించారు. కేటీఆర్‌కు కూడా అదే తరహాలో నోటీసులొచ్చాయని తెలిపారు. ఈ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారనీ, బొగ్గు కుంభకోణం వాస్తవాలు బయటకొస్తాయని పేర్కొన్నారు.
ఎంపీ వద్దిరాజు ఖండన
మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు సిట్ నోటీసులివ్వడాన్ని బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకులపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారనీ, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారనీ, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
అటెన్షన్ డైవర్షన్‌లో భాగమే సంతోష్‌కు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



