Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి..

- Advertisement -

మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి: ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంచడంతోపాటు ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అన్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాల పెంపు కొరకు గత ఐదు రోజులుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది.శిక్షణ ముగింపు కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్, మండల విద్యాధికారి ఆంధ్రయ్య  మాట్లాడుతూ తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానంలో తరగతి గదిలో విద్యార్థులకు సులభమైన రీతిలో నేర్పడం ఎలా అనే అంశాలపై, మెరుగైన అభ్యసన ఫలితాలు సాధించుటకు ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇచ్చారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు పెంచడంలో తన వంతు పాత్ర పోషించాలన్నారు. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుటకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కృత్యాధార బోధన చేసినప్పుడే మెరుగైన అభ్యసన ఫలితాలు వస్తాయని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్లు చంద్రశేఖర్, రవీందర్, వేణుగోపాల్, అశోక్, శంకర్ గౌడ్, మారుతి, పసుపుల  ప్రసాద్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -