Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'జడల్‌'గా నాని

‘జడల్‌’గా నాని

- Advertisement -

హీరో నాని ‘ది ప్యారడైజ్‌’ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడూ చేయని క్యారెక్టర్‌ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌ పై నిర్మాత సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి శుక్రవారం నాని ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది.
పోస్టర్‌లో రగ్డ్‌ మీసం, గెడ్డం, రెండు జడలతో కనిపించిన నాని పాత్ర పేరు ‘జడల్‌’. పోస్టర్‌ కంపోజిషన్‌, ఆయన వెనక, కత్తులు-బుల్లెట్లతో తయారైన ఒక భారీ రౌండ్‌ వీల్‌ ఒక రకమైన డేంజర్‌ని సూచిస్తోంది. ‘దసరా’ తర్వాత నాని-శ్రీకాంత్‌ ఓదెల మరోసారి కలిసి చేస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే ఇంటెన్స్‌ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా. ఇది వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img