Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సబ్జెక్టుల్లో ఉత్తీర్ణ శాతం పెంచాలి

సబ్జెక్టుల్లో ఉత్తీర్ణ శాతం పెంచాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
నవతెలంగాణ – వనపర్తి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైన్స్, మ్యాథమెటిక్స్, బయోసైన్స్, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రత్యేక తరగతుల నిర్వహించి ఆయా సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం పెంచాలని విద్యాశాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎఫ్ ఆర్ ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) పనితీరుపై ఆయా మండల ఎంఈఓ లను అడిగి తెలుసుకున్నారు. ఫేస్ రికగ్నిషన్ చాలా కీలకమైనదని మొదటగా టీచర్లు ఎఫ్ ఆర్ ఎస్ లో హాజరు నమోదు చేయాలని, దాని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల ఫేస్ రిగ్గ్నేషన్ చేసి హాజరు శాతాన్ని పెంచాలన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఆపా కార్డులో ఎన్రోల్మెంట్ ఎంత జరిగిందని విద్యాశాఖ అధికారుల నుంచి నివేదిక తీసుకుని పరిశీలించారు.

ఆపా కార్డుకు 55వేల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నప్పటికీ.. ఎందుకు ఎన్రోల్మెంట్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. పక్షం రోజుల్లోనే ఆపా కార్డ్ ఎన్రోల్మెంట్ వేగవంతం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 54% ఆపా కార్డు ఎన్రోల్మెంట్ జరిగిందని , ఆ శాతాన్ని ఇంకా పెంచాలని సూచించారు. అలాగే నిర్వహించిన ఏఐ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) తరగతుల పై విద్యార్థుల అభిప్రాయాలతో పాటు తరగతులు ఎలా నడుస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు కొరత ఏమైన ఉందా అని తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి మహమ్మద్ గని, ఏపీవో నరేందర్ రెడ్డి, ఆయా మండలాల ఎంఈఓ లు విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad