Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురాజీ మార్గమే రాజమార్గం.. 

రాజీ మార్గమే రాజమార్గం.. 

- Advertisement -

పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలి 
తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి 
నవతెలంగాణ – తాడ్వాయి 
: రాజీమార్గమే రాజమార్గమని, కక్ష్యదారులు తమ పెండింగ్లో ఉన్న కేసులను రాజమార్గం ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు ఈనెల 14న లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని పరిష్కరించుకోవాలని తాడ్వాయి ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోర్టులో సంవత్సరాల పాటుగా పరిష్కరించబడని కేసులు రాజీపడటం వల్ల తక్షణం పరిష్కరించబడుతాయని అన్నారు. దీనివల్ల సమయం, డబ్బులు వృధా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా చట్టరీత్యా రాజీకి అర్హమైన క్రిమినర్ కేసులు సివిల్ తదితర కేసులను ఈ అదాలత్ లో పరిష్కరించుకోవాలని ఈ సందర్బంగా ఎస్సై సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad