Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఈపెండింగ్లో ఉన్న రూ.8300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, స్కాలర్షిప్లు రాక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో ఉన్నాయని,  రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ లావుడియ రాజు అన్నారు. మంగళవారం రోజున ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ అధికారి జగన్  మోహన్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకుండా కాలయాపన చేసిందనీ అన్నారు.

ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసిందనీ , ప్రజాపాలన పేరుతో అధికారులను వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం పూర్తిగా విప్లమైందని తెలిపారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ చూసి ఎత్తడం లేదని, తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నది అని అన్నారు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు  భవిష్యత్తు అంధకారంలో ఉన్నాయని, ఫీజు గోడు తీరేది ఎన్నాడో అదేవిధంగా ప్రభుత్వాలు మారుతున్న గాని  విద్యార్థుల భవిష్యత్తు మారడం లేదని అన్నారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోయిందని, చౌటుప్పల్, మోత్కూరు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నికల హామీ మిగిలిపోతుందని గుర్తు చేశారు. మండలానికి జూనియర్ కళాశాలలో ఏర్పాటులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి  లేదని అన్నారు.

రాష్ట్రంలో మద్యానికి ఎక్సైజ్ శాఖ మంత్రిని కేటాయించారు.. కానీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు  చెప్పుకోవడానికి  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేటాయించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు. జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ పూర్తిగా శిథిలావస్థలో చేరాయని అన్నారు. వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తెలంగాణ విద్యాసంస్థలు అంటేనే గురుకులాలని చెప్పుకుంటున్న  ప్రభుత్వం గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని అన్నారు. గురుకుల రోజుకు ఫుడ్ పాయిజన్ గురవుతున్నా.. ఏ విద్యార్థిని పరామర్శించకుండా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని అన్నారు.

గురుకులాల సమస్యలను పరిష్కరించాలని గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా జిల్లావ్యాప్తంగా అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు కాలినడకన ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని, ప్రైవేట్ విద్యా సంస్థలకు లోత్తాసు పలుకుతున్న జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేని పాఠశాలలపై గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.  రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని ప్రభుత్వ పాఠశాల నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  రాష్ట్ర కమిటీ సభ్యురాలు కుక్కుట్ల శివాని,జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్,  జగన్ నాయక్,గాయత్రి, సహాయ కార్యదర్శి తిగుళ్ల శ్రీనివాస్ పుట్టల ఉదయ్ హిందువు రాణి జిల్లా కమిటీ సభ్యులు ఎం డి నేహాల్ నరేందర్ , పూజిత,శ్రావణ్ మహేష్ సతీష్ వెంకటేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad