Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెన్షన్‌ ధ్రువీకరణ బిల్లును ఉపసంహరించాలి

పెన్షన్‌ ధ్రువీకరణ బిల్లును ఉపసంహరించాలి

- Advertisement -

సీనియర్‌ సిటిజన్ల ప్రయాణ రాయితీని పునరుద్ధరించాలి : పెన్షనర్ల ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని దాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీసీపీఏ) డిమాండ్‌ చేసింది. పెన్షన్‌ ధృవీకరణ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయా సంఘాల నేతలు కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఇదే అంశంపై పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీపీఏ సీఓసీ తెలంగాణ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి సోమయ్య, ప్యాట్రన్‌ ఎంఎన్‌రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, రామచంద్రు, మహేశ్‌, రమేష్‌, శాంసుందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, సుధాకర్‌రావు మాట్లాడుతూ పెన్షనర్లకు తీవ్ర నస్టాన్ని కలిగించే పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం 2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించటం, వేతన సంఘం సిఫారసులుంటాయని చెప్పడం అనేక అనుమాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్‌ వారి జీవిత భద్రతకు, గౌరవానికి ఆధారంగా ఉంటుందని చెప్పారు.

ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదనీ, ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి ప్రత్యేక గురింపు అని తెలిపారు. పెన్షన్‌ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుల వల్ల విశ్రాంత ఉద్యోగుల్లో గందరగోళాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయని చెప్పారు. పెండింగ్‌ డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను విడదీసేందుకు ఎన్‌పీఎస్‌, యూపీఎస్‌, కేపీఎస్‌ అంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు. ఓపీఎస్‌ పెన్షనర్ల పట్ల ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. వారిని విడదీయటం సరికాదని న్యాయస్థానం చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -