హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబోలో రాబోతున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘ఏజెంట్’ సినిమా జరుగుతున్న సమయంలోనే నిర్మాత అనిల్ నాతో మరో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన ప్రామీస్ నిలబెట్టుకున్నారు.
కథ వినగానే చాలా మంచి కథ చేసే అవకాశం వచ్చిందనిపించింది. కచ్చితంగా ఈ సినిమా చేయాలని వెంటనే సైన్ చేశాను. ఈ సినిమాకి స్టోరీ ఈజ్ కింగ్. ఇందులో నేను చేసిన నిత్య క్యారెక్టర్, ఈ కథ నాకు బాగా నచ్చాయి.
ఈ క్యారెక్టర్ నాకు పర్సనల్‌గా చాలా రిలేట్ అవుతుంది. తను ఇన్నోసెంట్‌గా కనిపించే అమ్మాయి. నిజాయితీగా ఉంటుంది. శర్వాతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయనతో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. అలాగే మిగిలిన అందరూ కూడా చాలా మంచి కోస్టార్స్. షూటింగ్ సమయంలో వెన్నెల కిషోర్ పెర్ఫార్మెన్స్‌ని చూస్తే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అలాగే ఇందులో నరేష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మ్యూజిక్ రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే పాటలు ఇవి. ఖచ్చితంగా థియేటర్స్‌లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సంయుక్తతో నాకు చాలా మంచి కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. తను చాలా స్వీట్ పర్సన్. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వాటి గురించి మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు.
ఈ సంక్రాంతికి సరైన సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


