Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థి దశ నుంచి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి 

విద్యార్థి దశ నుంచి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
విద్యార్థి దశ నుంచి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని   సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్ న్యాయవాదిగా టాడి ఆనంద్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆదివారం సమాచార హక్కు చట్టంపై విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  విద్యార్థినులు విద్యార్థి దశ నుండి ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో తమకు కావాల్సిన సమాచారం ఈ చట్టం ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పారు.

ఈ చట్టం వజ్రాయుధం రామబాణం లాంటిదని చెప్పారు దేశవ్యాప్తంగా పట్టి పీడిస్తున్న అవినీతి అంతం చేసినందుకు చట్టం ఎంతో దోహద పడుతుంది అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ శాఖ నుండి సమాచారం అందకపోతే పై అధికారికి అప్పిలు చేసుకోవచ్చని తెలిపారు. సమాచారం అసంతృప్తి, తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం దరఖాస్దారునికి తప్పుడు సమాచారం ఇచ్చిన అసంపూర్తి సమాచారం ఇచ్చిన అధికారికి దినసరి 250 చొప్పున 25 వేల రూపాయలకు ఉంచకుండా తగిన రుసుమును ప్రభుత్వం ద్వారా రాబట్టుకునే అవకాశం ఉంది అని అన్నారు. అలాగే సాధించిన విజయాలు వివరంగా తెలిపారు. జీవించే హక్కు భంగం కలిగిన సందర్భాల్లో 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డెన్ షబానా బేగం , విద్యార్థినిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -