వరద ఉదృతిని తిలకించిన భక్తులు..
నవతెలంగాణ – ముధోల్
బాసర గోదావరి ఉధృతి ప్రవహించడంతో స్థాన ఘట్టాలు నీటమునిగాయి. దీంతో బాసర వచ్చే భక్తులు పుణ్యస్నానాలకు ఇబ్బంది ఏర్పడింది. మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురియటంతో వరద నీరు ప్రవాహం పెరగడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో గోదావరి స్థాన ఘట్టాలకు ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుంది. ఈరోజు సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం కావడంతో దేశ నలుమూలల నుండి భక్తులువస్తున్నారు.
అయితే బాసరకు వచ్చే భక్తులు ముందుగా గోదావరిలో స్నానాలు ఆచరించిన అనంతరం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో స్థాన ఘట్టాలు నీట మునిగటంతో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించలేకపోతున్నారు. స్థాన ఘట్టాల వద్ద వరద నీరు ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో పోలీసులు స్థాన ఘట్టాల వైపు భక్తులను రానివ్వడం లేదు. స్థాన ఘట్టాల వైపు వెళ్ళవద్దని భక్తులకు పోలిసులు సూచింస్తున్నారు. భక్తులు గోదావరి ఉధృతి ని తిలకించి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నారు.
బాసరలో నీట మునిగిన స్థాన ఘట్టాలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES