నవతెలంగాణ-హైదరాబాద్: సత్యసాయి బాబా శత జయంతోత్సవాలలో పాల్గొనడానికి శనివారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, హిందూపురం ఎంపీ బికే. పార్థసారథి, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, పుట్టపర్తి ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి బాబా మహాసమాధికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్, తదితరులు నివాళులర్పించారు. ప్రశాంతి నిలయంలోని ఆలయంలో రాష్ట్రపతి ప్రార్థించారు. వేద పండితులు కలిసి రాష్ట్రపతికి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ టెస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్.జె.రత్నాకర్, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పుట్టవర్తికి చేరుకున్న రాష్ట్రపతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



