నవతెలంగాణ – కంఠేశ్వర్
దొడ్డి కొమరయ్య నగర్ లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య నగర్ కాలనీలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం బోరు వేసి మంచినీటి సౌకర్యం కలిపేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడే ఉంటున్న గల్లీ లీడర్లు గా చలామణి అవుతున్న కొంతమంది నెలకు వంద రూపాయలు ఇవ్వాలని రిపేర్ డబ్బులు రూ.200 వసూలు చేస్తూ పేదలపై దౌర్జన్యాలు దాడులు చేస్తూ ఉన్నారు. కావున ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టి వారిని ప్రజల పైన దాడులు ధైర్యం చేయకుండా పరిష్కారం చేయాలని కోరారు లేదంటే రేపు రానున్న రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు మంగళ్ బాయ్, రజియా, లక్ష్మి భాయ్, రేష్మ, సరో బాయ్, రబ్బాని, ఆసియా, అనూష బాయ్, ఆశ తదితరులు పాల్గొన్నారు.
దొడ్డి కొమురయ్య నగర్ లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



