Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

ఎంపీడీవో కార్యాలయంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినతి
సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన చేపడుతాం
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు

గ్రామాలలో పారిశుద్ధ్య పనులు పేరుకుపోయాయని, స్వచ్చమైన త్రాగునీరు లేదని, గ్రామాల్లో నీటి నిలువలు విపరీతంగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ నాగేల్లి మధునకు వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అంతర్గత రోడ్లు ధ్వసమై, చాలా కాలంగా నీటి నిల్వలు నిలిచి ఉన్నాయని అన్నారు.

గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో కొంతమంది డబ్బులు లేవని, మేము ఏమి చేయలేమని అంటున్నారని తెలిపారు. కనీసం ఈ సీజన్ వ్యాధుల నుంచి బయటపడేందుకు నీరు రోడ్లపై నిల్వ లేకుండా చేసి, నీళ్లను మళ్లించాలని అన్నారు. అపరిశుభ్రతగా ఉన్న ప్రాంతాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. దీనివల్ల దోమలు విపరీతంగా పెరిగి, ప్రజలు వివిధ రకాల జబ్బుల బారిన పడుడుతున్నారని అన్నారు. కనీసం రోడ్ల వెంట చెత్తాచెదారం, గడ్డి లేకుండా గతంలో చేసేవారని, ఇప్పుడు ఆ పనులు ఎవరు చేయించడం లేదని అన్నారు. వీధిలైట్లు కూడా పెట్టించలేని పరిస్థితి ఉందని, చీకట్లో, బురదలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారులు వెంటనే స్పందించి, గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించని ఎడల ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్, పెరుమాండ్ల పుల్లయ్య, కొట్టెం వెంకన్న, బండ వెంకన్న, మయ్య మహేందర్, గద్దల సైదులు, ఇసంపెల్లి వెంకటయ్య, రవీందర్, ఇసంపేల్లి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad